Namaste NRI

అమెరికాలో అత్యంత కీలకమైన సమాచారం లీక్

అమెరికాలో అత్యంత కీలకమైన రక్షణ రహస్య పత్రాలు ఈ ఏడాది మార్చిలో డిస్కార్డ్ అనే సామాజిక మాధ్యమంలో కన్పించాయి. ఇందులో అమెరికా రక్షణభద్రతా విభాగ వ్యూహాలు, ఇరాన్, జోర్డాన్ మొదలుకుని ఇప్పటి ఉక్రెయిన్ వరకూ రక్షణ శాఖ యంత్రాంగ వివరాలు ఉన్నాయి. ఆ తరువాత ఈ కీలక పత్రాలు మరిన్నిగా వెలువడుతూనే ఉన్నాయి. దీనితో పెంటగాన్ ఇంత అత్యల్ప దుర్భేధ్య పరిస్థితిలో ఉందనే విషయం ప్రపంచానికి తెలియడంతో బైడెన్ అధికార యంత్రాంగానికి సవాలు ఏర్పడింది. ఇంతకూ ఈ కీలక పత్రాలను లీక్ చేసింది కేవలం 21 ఏండ్ల యువకుడు జాక్ టెయిక్సిరా అని దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. ఈ చాక్లెట్ బాబు అమెరికా వాయుసేనలో సైబర్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ జర్నీమెన్‌గా అత్యంత చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. భద్రతా సమాచారాన్ని సంబంధిత విభాగాల రికార్డులలో భద్రపర్చడం, ఇతర సెక్షన్స్‌కు ఆన్‌లైన్‌లో పంపించడం ఈ జాబ్‌లో భాగం. ఇటువంటి ఉద్యోగానికి కావల్సింది కేవలం హైస్కూల్ డిగ్రీ, డ్రైవర్ లైసెన్సు, తరువాత 18 నెలల పాటు ఉద్యోగ శిక్షణ అంతే. కీలక రహస్య సమాచారం లీక్‌ను పసికట్టి వెంటనే ఎప్‌బిఐ రంగంలోకి దిగింది. మసాఛూసెట్స్‌లోని దిగ్టన్‌కు చెందిన ఈ యువకుడిని అరెస్టు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress