సూర్య, రీతూశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అమితాబ్ బచ్చన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను పారిశ్రామికవేత్తలు సతీష్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. దర్శకుడు మోహన్ కాంత్ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్ ఈ పేరొక సంచలనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. చక్కటి ప్రేమకథా చిత్రమిది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కిరణ్ దాసరి, సంగీతం: ఆశ్రీత్ అయ్యంగార్, కథ, దర్శకత్వం: జమ్మలమడుగు మోహన్‌కాంత్, నిర్మాత: జె.చిన్నారి, సహనిర్మాత: అక్కల శ్రీనివాస్ రాజు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి తదితరులు పాల్గొన్నారు.