Namaste NRI

అమెరికా, కెనడా మధ్య వివాదం వేళ… ఆసక్తికర పరిణామం

అమెరికా – కెనడా మధ్య సుంకాల వివాదం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. నేను ఇప్పుడే కెనడా ప్రధాని మార్క్‌ కార్నీతో ఫోన్‌లో మాట్లాడాను. ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. చాలా విషయాలపై ఓ ఒప్పందానికి వచ్చాం. రాజకీయాలు, వ్యాపారం సహా ఇతర అంశాలపై చర్చించేందుకు త్వరలో భేటీ అవుతాం. కెనడా ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశామవుతాం అని ట్రంప్‌ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News