ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్‌కు ఓ ఊహించని సమస్య ఎదురయ్యింది. ఇటీవల ఆయన విండోస్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయగా, మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి వచ్చింది. కానీ, విండోస్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఇష్టపడని మస్క్ ఎక్స్ వేదికగా తనకు ఎదురైన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చారు. సరైన స్పంద న రాకపోవడంతో, చివరకు మైక్రోసాఫ్ట్ అధినేత సత్యా నాదెళ్లకే డైరెక్టుగా మెసేజ్ పెట్టి తన సమస్యను వివరించారు. సత్యా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అనాలని కాదు. కానీ, మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుం డా విండోస్‌ను వాడుకునేందుకు అనుమతించండి. ఒకవేళ కంప్యూటర్ వైఫైకి కనెక్ట్ అయితే ఈ ఆప్షన్ కనిపించకుండా పోతుంది. అదేవిదంగా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్న వర్క్ ఈమెయిల్ అడ్రస్ వాడుకోలేము. నాకు కేవలం వర్క్ ఈమెయిల్ అడ్రస్ వాడుకోలేము. నాకు కేవలం వర్క్ ఈమెయిల్స్ మాత్రమే ఉన్నాయి అని మైక్రోసాఫ్ట్ అధినేతకు ఎలాన్ మస్క్ మెసేజ్ చేశారు. అయినా నాదెళ్ల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రాలేదు.














