
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ శివంగి. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకుడు. నరేశ్‌బాబు పి. నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 7న విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక క్రైమ్‌ని ప్రెజెంట్ చేస్తూ టీజర్ మొదలైంది. తన జీవితంలో జరిగిన రెండు ముఖ్య విషయాలు ఆనందిని వెంటాడుతుంటాయి. తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? అనేది చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. వంగేవాళ్లు ఉన్నంతవరకూ మింగే వాళ్లు ఉంటారు. నేను వంగే రకంకాదు.. మింగే రకం అనే బోల్డ్ డైలాగ్ టీజర్‌లో హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: భరణి కె.ధరన్, సంగీతం: ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్, నిర్మాణం: ఫస్ట్‌కాపీ మూవీస్.
