Namaste NRI

ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు కూటమి ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు కూటమి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి లోక్ భలో ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ ప్రధానిని శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మోదీ లోకేష్ కి కంగ్రాట్స్ చెప్పారు. తరువాత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేష్, ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి, ఆవ‌శ్య‌క‌త స‌భ్యులు వివ‌రిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్క‌బొడుచుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిల‌వ‌డం ఐదుకోట్ల ఆంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అద్దం ప‌ట్టింది. లోక్ స‌భ వేదిక‌గా అమ‌రావ‌తి గొప్ప‌త‌నం దేశ‌మంత‌టికీ మ‌రోసారి ప‌రిచ‌య‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధినీ ఆప‌లేరు నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events