Namaste NRI

వెంకీ-కళ్యాణ్ రామ్ తో.. అనిల్ రావిపూడి మల్టీస్టారర్

ఈ ఏడాది మన శంకర వరప్రసాద్‌గారు చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌కొట్టారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ నేపథ్యంలో వెంకటేష్‌, కల్యాణ్‌రామ్‌లతో ఆయన తెరకెక్కించబోతున్న భారీ మల్టీస్టారర్‌పై ఇప్పటికే హైప్‌ క్రియేట్‌ అయింది. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో లాంచింగ్‌ డేట్‌తో పాటు టైటిల్‌ వివరాలను తెలియజేయనున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి శైలిలో వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలబోసిన చిత్రమిదని, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు.

ఎఫ్‌-2, ఎఫ్‌-3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌గారు వంటి హిట్‌ చిత్రాల తర్వాత వెంకటేష్‌-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదవ సినిమా ఇదే కావడం విశేషం. అలాగే పటాస్‌ తర్వాత కల్యాణ్‌రామ్‌తో అనిల్‌ రావిపూడి చేస్తున్న రెండో చిత్రమిది. తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌లోనే దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సమర్పకులు: సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీమతి అర్చన, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events