Namaste NRI

అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా విద్యార్థులకు.. కాశీనాథుని విశ్వనాథ్‌ అవార్డు

జగద్విఖ్యాత దర్శకుడు స్వర్గీయ కె.విశ్వనాథ్‌ పేరిట, ఆయన కుటుంబం ఓ అవార్డును నెలకొల్పింది. కాశీనాథుని విశ్వనాథ్‌ అవార్డు పేరుతో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రథమంగా అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు విశ్వనాథ్‌ కుటుంబం అందజేసింది. సినిమాలోని విభిన్న శాఖల్లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించే ఇద్దరు విద్యార్థులను ఈ సందర్భంగా విశ్వనాథ్‌ కుటుంబం సత్కరించారు.  ప్రతి ఏడాదీ ఈ అవార్డును ఇద్దరు విద్యార్థులకు అందిస్తామని, ప్రోత్సాహకంగా 25వేల రూపాయల నగదు కూడా అందిస్తామని విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌ కుమారుడు, కోడలు నాగేంద్ర, లక్ష్మి, వారి కుమారుడు ప్రణవ్‌లతో పాటు అక్కినేని నాగార్జున, అమల కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events