ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ రాబోతున్నది. ఇప్పటికే విండోస్ వినియోగదారులకు వీడియో కాలింగ్‌ను పరిచయం చేసిన వాట్సాప్, ఇప్పుడు ఏకంగా ఒకేసారి 32 మంది వీడియోకాల్‌లో మాట్లాడుకొనేలా మరో ఫీచర్‌ను తెచ్చేందుకు పనిమొదలుపెట్టినట్టు ప్రకటించింది. దీంతోపాటు వాట్సాప్ విండోస్ యూజర్లకు వ్యూ వన్స్ ఫీచర్‌నూ అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం విండోస్ యాప్‌లో ఒకేసారి 8 మంది వీడియోకాల్‌లో, 32 మంది ఆడియోకాల్‌లో మాట్లాడే అవకాశం ఉన్నది.