రష్మిక మందన్న బంపర్ ఆఫర్ కొట్టేసింది. పుష్ప2 యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్‌గా అవతరించిన ఈ అందాలబొమ్మ, త్వరలో సల్మాన్‌ఖాన్‌తో జతకట్టనుంది. సల్మాన్‌తో మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేసినట్టు మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. మా సికిందర్ లో సల్మాన్‌ఖాన్ జోడీగా నటించేందుకు రష్మికకు ఆహ్వానం పలుకుతున్నాం.
ఈ జంట ఆన్‌స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్ పండుగకి సల్మాన్, రష్మిక తెరపై సాక్షాత్కరిస్తారు అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై రష్మిక స్పందిస్తూ నా నెక్ట్స్ సినిమా అప్టేట్ చెప్పమని అభిమానులు తరచూ అడుగుతుంటారు. వారికోసం అద్భుతమైన అప్‌డేట్ ఇస్తున్నా. సల్మాన్ సార్‌కి జోడీగా సికిందర్ లో నటిస్తున్నా. ఈ అవకాశాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా అని తెలిపింది నేషనల్ క్రష్.