చైనా కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు మరో దేశం షాక్ ఇచ్చింది. ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గోప్యత, భద్రత పరంగా ఇది ప్రమాదకరమని పేర్కొంది. అంతర్జాతీయ భాగస్వాముల సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై తమ దేశంలో టిక్ టాక్ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. అన్ని మొబైల్స్, ఇతర డివైజెస్ నుంచి దీన్ని తొలగించాలని సూచించింది. కెనడా వాసుల ఆన్ లైన్ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. టిక్ టాక్ పై నిషేధం ఈ దిశగా తీసుకున్న చర్యల్లో ఒకటని తెలిపారు.