టిక్‌టాక్‌ను ఆస్ట్రేలియా నిషేధించింది. ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించిందని స్థానిక మీడియా నివేదించింది. భద్రతా సమస్యల కారణంగా చైనాకు చెందిన వీడియో యాప్‌ను నిషేధించిన ఇతర దేశాలను ఆస్ట్రేలియా అనుసరించినట్లు మీడియా నివేదికలో పేర్కొన్నారు. హోం వ్యవహారాల శాఖ సమీక్ష అనంతరం ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ అంగీకరించినట్లు అటార్నీ జనరల్ మార్క్ డ్రెఫుస్ ఓ ప్రకటనలో తెలిపారు. నిఘా, భద్రతా ఏజెన్సీల సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, కెనడా, బెల్జియం, యూరోపియన్ దేశాలు ఇప్పటికే భద్రతా సమస్యలను పేర్కొంటూ అధికారిక పరికరాలలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాయి. బీజింగ్‌కు చెందిన బైట్‌డాన్స్ కంపెనీ యాజమాన్యంలోని యాప్‌లోని యూజర్ డేటా చైనా ప్రభుత్వం చేతులకు చేరుతుందని సమాచారం మేరకు టిక్‌టాక్‌ను పలుదేశాలు నిషేధిస్తున్నాయి.