అమెరికాలో మరో బ్యాంక్ సంక్షోభం అంచున ఉందని వార్తలు వెలువడుతున్నాయి. వారం రోజుల్లో ఇప్పటికే రెండు బ్యాంక్‌ల పతనాన్ని చూసిన 14వ అతిపెద్దదైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ లిక్విడిటీ కొరతతో సతమతమవుతూ వివిధ మార్గాలను అన్వేషిస్తున్నదని సమాచారం. రెండు రోజుల క్రితమే ఈ బ్యాంక్‌ను రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, ఎస్ అండ్ పీలు డౌన్‌గ్రేడ్ చేశాయి. లిక్విడిటీ, ఫండింగ్ రిస్క్‌ల కారణంగా ఫస్ట్ రిపబ్లికన్ బ్యాంక్ రేటింగ్ ‘నెగిటివ్ వాచ్’లోకి డౌన్‌గ్రేడ్ అయ్యింది. పలు ప్రతికూల వార్తల నేపథ్యంలో వారంలోనే 70 శాతం పతనమైన ఫస్ట్ రిపబ్లికన్ షేరు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 30 శాతం మేర నష్టపోయింది. 1985లో ప్రారంభమైన ఈ బ్యాంక్ వాణిజ్య బ్యాంకింగ్ సర్వీసులతో పాటు ఇన్వెస్ట్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసుల్ని సైతం నిర్వహిస్తున్నది.