యునెస్కో భారత్‌కు మరో శుభవార్త అందజేసింది. గుజరాత్‌లోని ధోలవిర ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. హరప్పా నాగరికతకు ధోలవిర నగరం ఓ గుర్తుగా నిలుస్తుంది. ధోలవిరకు వరల్డ్ హెలిటేజ్ జాబితాలో చోటు దక్కిన విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. దోలవిరా ఇప్పుడు భారత్‌లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఇండియా సూపర్`40 క్లబ్‌లో చేరిందని మంత్రి వెల్లడిరచారు. ఇండియా ఇవాళ గర్వపడాల్సిన దినమని, ముఖ్యంగా గుజరాతీ ప్రజలకు ఇది శుభదినమన్నారు.
2014 నుంచి భారత్‌లో కొత్తగా పది ప్రపంచ వారసత్వ సంపదలుగా జాబితాలో చేరాయని, ఇది మొత్తం సైట్లలో నాలుగవ వంతు అని, ప్రధాని మోదీ కమిట్‌మెంట్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భారతీయ సంస్కృతి, వారసత్వం, జీవన విధానాన్ని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్న తీరు ఆయన దీక్షను చాటుతుందని మంత్రి తెలిపారు.