
హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటిస్తున్న చిత్రం దీవాన. ఈ ప్రేమకథా చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఓ పెళ్లి వేడుకలో తొలిచూపులోనే కథానాయిక ప్రేమలో పడతాడు హీరో. అప్పటి నుంచి ఆ అమ్మాయే ప్రాణంగా జీవిస్తుంటాడు. అమ్మాయి తరపు వాళ్లు చాలా ప్రమాదకర వ్యక్తులని చెప్పినా వినిపించుకోడు. ఈ నేపథ్యంలో జరిగే సన్నివేశాలతో టీజర్ ఆసక్తినిరేకెత్తించింది. సంగీతభరిత ప్రేమకథా చిత్రమిదని, సహజత్వానికి దగ్గరగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వంశీ పచ్చిపులుసు, సంగీతం: ఈశ్వర్‌చంద్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి.















