
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా తన రెండో అత్యున్నత జాతీయ పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్ తో సత్కరించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని అత్యం త వినమ్రతతో స్వీకరిస్తున్నానని చెప్పారు. దీనిని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విశిష్ట పురస్కారాన్ని స్వీకరించిన రెండో విదేశీ నేత ఆయన. 1969లో క్వీన్ ఎలిజబెత్‌ను ఈ అవార్డుతో నైజీరి యా గౌరవించింది. మోదీకి లభించిన ఇటువంటి విదేశీ పురస్కారాల్లో ఇది 17వది.
