ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు.
యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ దవాఖానకు వెళ్తుండగా దాడి జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తున్నది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తున్నది.