తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంలో భాగంగా నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో చేపట్టిన ఐటీ హబ్ భవన నిర్మాణం పూర్తయింది. 3.20 ఎకరాల విస్తీర్ణంలో జిG3 అంతస్తుల్లో ఈ హబ్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించే కంపెనీల కోసం 50 వేల చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇప్పటివరకు 12 కంపెనీలు ఐటీ హబ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థ నూతన భవనంతో పాటు ఐటీ హబ్‌ను ఈ నెల 29న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తెలిపారు. 750 మంది యువతకు, 4వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.