Namaste NRI

ఇస్రో మరో కీలక ప్రయోగం!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. ఈ నెల 30న రాత్రి 9.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్‌ని నింగిలోకి పంపనున్నది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం చేపట్టనున్నది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక సాంకేతి క పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టబోతున్నది. ఈ నెల 5న ఇస్రో విజయ వంతంగా ప్రోబా-3 మిషన్‌ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ యూరోపి యన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత, ఇస్రో ప్రస్తుతం పీఎస్ఎల్వీ సీ-60 ప్రయోగానికి పూర్తి స్థాయి సిద్ధమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress