Namaste NRI

నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం : మహేష్ బిగాల

తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయిందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భారీ రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌లోకి అధికారికంగా నీటిని సీఎం కేసీఆర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందనుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని దాదాపు 12 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేసుకురుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ జల సంకల్పంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి కొమురవెల్లి మల్లన్న సాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events