
అమ్మాయిలూ పిల్లల్ని కనండి. మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం అంటూ విద్యార్థినులను వేడుకుంటు న్నది రష్యా ప్రభుత్వం. రోజురోజుకు తగ్గుతున్న జనాభాపై ఆందోళన చెందుతున్న క్రమంలో రష్యా వారికి ఈ ఆఫర్‌ను ప్రకటించింది. జపాన్, చైనా తరహాలోనే రష్యాలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య బాగా తగ్గిపోతు న్నది. ఈ అంతరాన్ని తగ్గించడానికి పిల్లలను కనమంటూ ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా రష్యా కూడా 25 ఏండ్ల లోపు యువ విద్యార్థినులు బిడ్డకు జన్మనిస్తే వారికి 1,00000 రూబెల్స్ (సుమారు రూ.84,000) ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించినట్టు మాస్కో టైమ్స్ వెల్లడించింది. వారు కరేలియా వాసులై ఉండి స్థానిక విశ్వవిద్యాలయం, లేదా కళాశాలలో చదువుతూ ఉండాలని నిబంధన విధించింది.
