అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తిని కీలక పదవికి నామినేట్ చేశారు. ఇండో`అమెరికన్ అటార్నీ అరుణ్ సుబ్రమణియమ్‌ను న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నామినేట్ చేశారు. వైట్‌హౌస్ ఇప్పటికే అరుణ్ నామినేషన్‌కు సెనేట్ ఆమోదం కోసం పంపించింది. ఒకవేళ సెనేట్ ఆమోదిస్తే న్యూయార్క్ దక్షిణ జిల్లా జడ్జిగా బాద్యతలు చేపట్టిన తొలి దక్షిణాసియా, భారతీయ అమెరికన్‌గా అరుణ్ రికార్డుకెక్కుతారు. అరుణ్ 2004లో కొలంబియా లా స్కూల్ నుంచి జూరిస్ డాక్టర్ పట్టా పొందారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని సుస్మాన్ గాడ్ఫ్రే ఎల్ఎల్పీలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. 2007 నుంచి అరుణ్ ఇక్కడే పని చేస్తున్నారు. 2005 నుండి 2006 వకు న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోసం స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జి గెరేర్డ్ ఈ లించ్ వద్ద పని చేశారు. అరుణ్ నామినేషన్‌పై నేషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ బార్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలియజేసింది. అరుణ్ కీలక పదవికి నామినేట్ కావడం పట్ల భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)