తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించిన జై భీమ్ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారంగా పిలిచే అకాడమీ అవార్డు (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో సీన్ ఎట్ ది అకాడమీ పేరుతో ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని అప్‌లోడ్ చేశాడు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ సినిమా వీడియోను ఉంచడం ఇదే తొలిసారి. జిస్టస్ చంద్రు న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదించిన ఓ కేసును ఆధారంగా జై భీమ్ చిత్రాన్ని రూపొందించారు. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాదు విమర్శకులనూ మెప్పించింది. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. దీంతో చిత్ర బృందంతో పాటు, సూర్య అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)