అదానీ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అదానీ సంస్థ భాగస్వామిగా ఉన్న కొలంబో పోర్టు టెర్మినల్ ప్రాజెక్టు నిర్మాణానికి యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీఎఫ్‌సీ) నుంచి రావాల్సి న రుణం ఆగిపోయింది. శ్రీలంక రాజధానిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కోసం రూ.4,661 కోట్ల రుణాన్ని మంజూ రు చేసేందుకు గత నవంబర్‌లో అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డీఎఫ్‌సీ అంగీకరించింది. అయితే, భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని గౌతమ్ ఆదానీ సహా అదానీ గ్రూప్ ముఖ్యులపై అమెరికా న్యాయ శాఖ ఆరోపణల నేపథ్యంలో ఈ రుణం ఆగిపోయింది.
ఇప్పటివరకు ఈ రుణం కింద నిధులు విడుదల చేయని డీఎఫ్‌సీ, ఇప్పుడు తన నిర్ణయాన్ని సమీక్షించుకుం టున్నది. అదానీపై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలపై అవగాహన ఉందని, ఈ అంశాన్ని సమీక్షిస్తున్నా మని డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. పోర్టు టెర్మినల్ నిర్మాణానికి రుణం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు మంజూరు చేయలేదని తెలిపింది. మా ప్రాజెక్టులు, భాగస్వాములు అత్యున్నత నిబద్ధ త, సమగ్రతా ప్రమాణాలను పాటించేందుకు మేం కట్టుబడి ఉన్నాం అని డీఎఫ్‌సీ పేర్కొన్నది.