Namaste NRI

భారతీయ విద్యార్థులకు మరో ఎదురుదెబ్బ

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం నుంచి మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అమెరికాలో ఉద్యోగ అనుభవాన్ని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థులకు జీవనాడి లాంటి ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ప్రోగ్రామ్‌ని పూర్తిగా రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు కొత్త పన్ను ప్రతిపాదనలు, మోసపూరిత చర్యలపై కఠిన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024లో దాదాపు 2 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రామ్‌ ద్వారా, మరో 95,000 మంది స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) ఎక్స్‌టెన్షన్‌ ద్వారా ఉద్యోగ అనుభవాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇక భవిష్యత్తులో ఆ అవకాశం ఉండకపోవచ్చు.

అమెరికన్‌ వర్కర్లను దెబ్బతీస్తున్న ఓపీటీ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ కింద పనిచేసే విధానకర్తలు వాదిస్తున్నారు. ఓపీటీ వంటి వీసా క్యాటగిరీలను తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం చేయాలని సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌లో పాలసీ స్టడీస్‌ డైరెక్టర్‌ జెస్సికా వాఘన్‌ అమెరికన్‌ పార్లమెంట్‌ని కోరారు. అమెరికా ఇమిగ్రేషన్‌ చట్టం స్ఫూర్తిని ప్రస్తుత విధానం ఉల్లంఘిస్తోందని, ఎఫ్‌-1 విద్యార్థులకు చదువు తర్వాత పనిచేసే అధికారాన్ని కల్పించరాదని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న జోసెఫ్‌ ఎడ్లో గతంలో ప్రకటించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓపీసీ ప్రోగ్రామ్‌ని రద్దు చేసేందుకు చర్యలు వేగవంతం చేసే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events