Namaste NRI

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టాప్‌`సీక్రెట్‌ ఆపరేషన్‌ సమయంలో రష్యన్‌ గూఢచారి కెప్టెన్‌ హతమయ్యాడు. దీంతో ఇప్పటి వరకు 12 మంది కమాండర్లు మరణించారు. సైబీరియాలోని టియుమొన్‌కు చెందిన జిఆర్‌యు మిలటరీ ఇంటెలిజెన్స్‌ గూఢచారి కెప్టెన్‌ అలెక్సీ గ్లుష్‌చాక్‌ (31) మేరియుపోల్‌ మరణహోమంలో మరణించాడు. రష్యాలో గ్లుష్‌చుక్‌ అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు వెలువడ్డాయి. అక్కడ అతన్ని పూర్తి సైనిక లాంఛనాలతో ఖననం చేశారు.

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటి వరకు 12 మంది కమాండర్లు మరణించారు. మేజర్‌ జనరల్‌ ఆండ్రీ కొలెనస్నికోవ్‌,  జనరల్‌ విటాలి గెరాసిమోవ్‌తో పాటు మెరైన్‌ బ్రిగేడ్‌కు నాయకత్వం వహంచిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ డిమిత్ర స్రపోనోవ్‌, కల్నల్‌ జిజెవ్‌స్క్సీ  వైమానిక దళాలకు నాయకత్వం వహించిన డెవిస్‌ గ్లెబోవ్‌, కల్నల్‌ ఆండ్రీ జఖారోవ్‌  మరణించారు. ఆండ్రీ సుఖోవెట్నీ కీవ్‌ వెలుపల హోస్టామెల్‌ పోరాటంలో ఉక్రెయిన్‌ స్నిపర్‌ చేతిలో కాల్చిచంపబడ్డారు. మరో ఇద్దర పేరు తెలీని సీనియర్‌ కమాండర్లు కూడా మరణించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events