Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌

ఇరాన్‌తో తీవ్రంగా యుద్ధ వ్యూహాల్లో మునిగి ఉన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో షాక్‌ తగిలింది. తాజాగా విడుదలైన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాను 13-15 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ట్రంప్‌ తనపై లైంగిక దాడి చేశాడని ఒక మహిళ ఆరోపణలకు సంబంధించిన కీలకపత్రాలు అందులో ఉన్నాయి. ఇప్పటివరకు విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ పైళ్లలో ఇవి లేవు. అవి డూప్లికేట్‌ అని రాసి ఉన్న పత్రాల్లో కలిసిపోవడంతో గతంలో వాటిని విడుదల చేయలేదని న్యాయ శాఖ తెలిపింది. ఆ మహిళ 2019లో ఎఫ్‌బీఐకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం బాలల లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ న్యూయార్క్‌ లేదా న్యూ జెర్సీ నగరాలలో తనను ట్రంప్‌నకు 1980లో పరిచయం చేశాడని, అప్పుడు తన వయసు 13-15 మధ్య ఉందని తెలిపింది.

తర్వాత ట్రంప్‌ తనతో బలవంతంగా ఓరల్‌ సెక్స్‌ చేయడానికి ప్రయత్నించాడని ఆ మహిళ ఆరోపించింది. తాను తిరస్కరించగా, ట్రంప్‌ కొట్టాడని తెలిపింది. కాగా, కీలకమైన ఎప్‌స్టీన్‌ ఫైళ్లను దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేసేందుకు అటార్నీ జనరల్‌ బాండీకి సమన్లు జారీ చేయాలని హౌస్‌ కమిటీ నిర్ణయించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events