Namaste NRI

ప్రవాస భారతీయులకు మరో షాక్

ప్రవాస భారతీయులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది.  బ్రౌన్‌ యూనివర్సిటీ కాల్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌ కార్డ్‌ లాటరీ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. దీని ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడింది. దేశాధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్‌ను ఆపాలని యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ను ఆదేశించినట్లు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్‌ ఇచ్చిన ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో కాల్పులు, ఎంఐటీ ప్రొఫెసర్‌ హత్య కేసుల్లో అనుమానితుడు పోర్చుగీస్‌ జాతీయుడు క్లౌడియో నెవెస్‌ వాలెంటే ఈ ప్రోగ్రామ్‌ ద్వారానే అమెరికాలో ప్రవేశించాడు.

నెవెస్‌ గురువారం మరణించి కనిపించినట్లు అధికారులు తెలిపారు. అతను తనను తాను కాల్చుకుని మరణించాడని అనుమానిస్తున్నారు. అమెరికాలో 2025 వీసా లాటరీ కోసం సుమారు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. 1,31,000 మంది ఎంపికయ్యారు. వీరిలో లాటరీ విజేతల భార్య లేదా భర్త కూడా ఉన్నారు. లాటరీలో గెలిచిన తర్వాత వీరు క్షుణ్ణంగా తనిఖీలు చేయించుకోవాలి, ఆ తర్వాత మాత్రమే వారికి అమెరికాలోకి ప్రవేశం లభిస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events