చైనా రాజధాని బీజింగ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాలని బ్రిటన్, కెనడా దేశాలు నిర్ణయించుకున్నాయి. బీజీంగ్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘటన జరగుతుందన్న కారణంగా ఈ దేశాలు శీతాకాల విశ్వక్రీడలను బహిష్కరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఇదివరకే ప్రకటించాయి. అయితే వరుసగా ఒక్కో దేశం ఒలింపిక్స్‌ను బహిష్కరించడంపై చైనా అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్న దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. జపాన్, న్యూజిలాండ్ కూడా చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)