అమెరికాలోని కాలిఫోర్నియా ఇప్పటికే వరదలతో సతమతమవుతుంది. తాజాగా కాలిఫోర్నియాను మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో 3,60,000లకు పైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు నిలిచిపోయింది. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అధికారులు కూడా సహాయ చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో పలు విమానాలను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.