టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. చెనైలో 1948 డిసెంబర్ 7 జన్మించారు శివశంకర్ మాస్టర్. ఆయన తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి. 1947లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్య దర్శకుడిగా పనిచేసిన మాస్టర్, భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 1975లో వచ్చిన తమిళ చిత్రం పాట్టు భరతమమ్ చిత్రంతో ఆయన కెరీర్ మొదలైంది. 800 చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా దాదాపు 30 చిత్రాల్లో నటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)