Namaste NRI

త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో మరో చిత్రం

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ క్రేజీ కాంబినేషన్‌లో ఒకటి మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందంటే క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాటల మాంత్రికుడు మరోసారి మహేశ్‌ బాబుతో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మూడవ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను ప్రకటించింది. దీనిపై చిత్ర బృందం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మహేష్‌ దుబాయ్‌లో ఉన్నాడు. అక్కడ మహేష్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ కలిశారు. సూపర్‌స్టార్‌తో సినిమా కథకు సంబంధించి చర్చలు జరిగాయని తెలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. వర్క్‌ అండ్‌ చిల్‌ విత్‌ టీమ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ప్రస్తుతం మహేష్‌ సర్కారువారి పాట చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాలు చేస్తాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events