దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ పై మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రం నుడి పోస్టర్స్, వీడియోలు విడుదల చేయగా వాటికి బారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియా, రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.














