ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కొవిడ్ వెలుగులోకి వచ్చిన సరిగ్గా ఐదేండ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం.హెచ్‌ఎమ్‌పీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్ -19 వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు తెలిసింది. అయితే, దీనిపై స్పష్టత లేదు.