అగ్రరాజ్యం అమెరికాపై ఆగ్రహంతో ఉన్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలతో బిజీగా ఉన్నారు. దానికి తగినట్టుగానే నార్త్ కొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా తూర్పు తీరం దిశగా మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసినట్టు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు సమీపంంలో ఉన్న సనన్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగినట్టు వెల్లడిరచింది. దీంతో మరోసారి కిమ్ జోంగ్ ఉన్ దక్షిణకొరియా, అమెరికా, జపాన్‌లను ఆందోళనకు గురి చేశారు. కాగా, ఈ ఏడాదిలో ఇది 14వ క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం.