ఈత కొలనులో అమెరికా స్విమ్మర్లు మరో ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. స్టార్ స్విమ్మర్ కెలెబ్ డ్రెసెల్ నేతృత్వంలోని అమెరికా 4స100 మీటర్ల మిడ్లే రిలే టీమ్ రికార్డు టైమ్లో రేసు పూర్తి చేసింది. 3 నిమిషాల 26.78 సెకన్లలో పూర్తి చేసి 2009 వరల్డ్ చాంపియన్షిప్ల్సో నమోదైన 3:27:17 నిమిషాల రికార్డును బ్రేక్ చేసింది. ఈ రిలేలో బ్రిటన్ (3:27.51), ఇటలీ (3:29,17) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొదట్లో అమెరికా స్విమ్మర్ ఆండ్రూ బ్రె స్ట్స్రోక్ లెగ్ పూర్తయ్యే సరికి బ్రిటన్ కంటే 20 మీటర్ల దూరంలో నిలిచింది. అయితే డ్రెసెల్ బటర్ట్స్ లెగ్ మొత్తం మార్చేసింది.