Skip to main content

Namaste NRI

అమెరికా స్విమ్మర్లు మరో ప్రపంచ రికార్డు

ఈత కొలనులో అమెరికా స్విమ్మర్లు మరో ప్రపంచ రికార్డు క్రియేట్‌ చేశారు. స్టార్‌ స్విమ్మర్‌ కెలెబ్‌ డ్రెసెల్‌ నేతృత్వంలోని అమెరికా 4స100 మీటర్ల మిడ్లే రిలే టీమ్‌ రికార్డు టైమ్లో రేసు పూర్తి చేసింది. 3 నిమిషాల 26.78 సెకన్లలో పూర్తి చేసి 2009 వరల్డ్‌ చాంపియన్షిప్ల్సో నమోదైన 3:27:17 నిమిషాల రికార్డును బ్రేక్‌ చేసింది. ఈ రిలేలో బ్రిటన్‌ (3:27.51), ఇటలీ (3:29,17) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొదట్లో అమెరికా స్విమ్మర్‌ ఆండ్రూ బ్రె స్ట్స్రోక్‌ లెగ్‌ పూర్తయ్యే సరికి బ్రిటన్‌ కంటే 20 మీటర్ల దూరంలో నిలిచింది. అయితే డ్రెసెల్‌ బటర్ట్స్‌ లెగ్‌ మొత్తం మార్చేసింది.

Social Share Spread Message

Latest News