కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన టీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరైనది కాదని విమర్శించారు. బీజేపీ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు గత పది రోజులుగా పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. రబీలో ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని, రా రైస్ రాదన్నారు. రబీ ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుందని, అందువల్ల బాయిల్డ్ రైస్‌గా మారుస్తారని తెలిపారు. ఈ సమావేశంలో భగవాన్ కాండ్ర, శ్రీనివాస్ గనగోని, రవి దన్నపనేని, ఇతర సభ్యులు పాల్గొన్నారు.