Namaste NRI

ఘాటీ లో అనుష్క విశ్వరూపం చూస్తారు:క్రిష్‌ జాగర్లమూడి

అనుష్క శెట్టి మోస్ట్‌ ఎవైటెడ్‌ యాక్షన్‌ డ్రామా ఘాటి. విక్రమ్‌ ప్రభు మేల్‌ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్ల మూడి నిర్మించారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ మాట్లాడుతూ కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి. ఘాటి అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు, అక్కడి తీవ్రమైన భావోద్వేగాలు, మనుషుల గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది. రచయిత చింతకింద శ్రీనివాసరావు ఈ ప్రపంచం గురించి నాకు చెప్పారు. ఎక్సైటింగ్‌గా అనిపించింది.

నా వేదంలో సరోజగా నటించిన అనుష్క, ఘాటి లో శీలావతిగా రాబోతున్నది. అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి, ఇలా ఎన్నో ఐకానిక్‌ క్యారెక్టర్స్‌ చేసిన అనుష్క కెరీర్‌లో మరో ఐకానిక్‌ క్యారెక్టర్‌ ఘాటి’లోని శీలావతి పాత్ర. ఆమె నటవిశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. సెన్సార్‌కి ఇచ్చే ముందు కాపీ చూసుకొని తనకి ఫోన్‌ చేశాను. ఇప్పటివరకూ తను చేసిన సినిమాల్లో ఫైనెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇదే అని చెప్పాను. అదేమాట ఆడియన్స్‌కి కూడా చెబుతున్నా. సాంకేతికంగా అన్ని విధాలా ఘాటి అద్భుతంగా ఉంటుంది. కననీ, విననీ పాత్రల్ని ఘాటిలో చూస్తారు. ఘాటిలో అందమైన సోల్‌ ఉంది. ఆడియన్స్‌ ఆ సోల్‌ని మనసులో నింపుకుని వెళ్తారు అని అన్నారు.  సెప్టెంబర్‌ 5న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events