Namaste NRI

ఆర్కియాలజిస్ట్‌  దక్ష  వచ్చింది

హీరో నాగచైతన్య ప్రస్తుతం ఓ మిథికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌సీ24 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ దండు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్‌ దక్ష పాత్రలో కనిపించనుంది. ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

గుహ మధ్యలో కూర్చొని పురాతన వస్తువులను పరిశీలిస్తున్న విజువల్స్‌ ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. కథాగమనం లో దక్ష పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ధైర్యసాహసాలు కలబోసిన మహిళగా ఆమె కనిపిస్తుందని మేకర్స్‌ తెలిపారు. బ్రహ్మగిరి అనే గుహల్లో నిధుల వేట నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కార్తీక్‌ దండు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events