Namaste NRI

ఏపీని ఆదుకునే ఎన్నారైల‌పై ఇంత అక్కసా?: జ‌య‌రాం కోమ‌టి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్నారైలపై వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శలు చేయ‌డం, బెదిరిం పుల‌కు గురి చేయ‌డం అత్యంత దారుణ‌మ‌ని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జ‌య‌రాం కోమ‌టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్నారైల‌ను బెదిరిస్తూ, ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ కు చెందిన బాప‌ట్ల జిల్లా వేమూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అభ్యర్థి వ‌రికూటి అశోక్ బాబు చేసిన వ్యాఖ్యల‌ను జ‌య‌రాం కోమ‌టి ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తున్న ఎన్నారైల‌ను తీవ్రంగా అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు స‌రికాద‌ని అన్నారు.

రాష్ట్రానికి ఎన్నారైల నుంచి అనేక మేళ్లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఉద్యోగ క‌ల్పన‌, ప్రజ‌ల‌కు ఆరోగ్య భ‌ద్రత‌, మురికివాడల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల ద‌త్తత‌, విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో ఎన్నారైలు కృషి చేస్తున్న విష‌యాన్ని వివ‌రించారు. అన్నింటికీమించి, రాష్ట్రానికి ఆదాయం పెంచేలా ప‌న్నులు చెల్లిస్తు న్నార‌ని, అదేవిధంగా ప‌రిశ్రమ‌లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థంలో ముందుకు తీసుకువెళ్తున్నార‌ని చెప్పారు . ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ నేత‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

ఒక వైపు ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లో ఉండగా, బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి ప్రవాస భారతీయు లను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కోడ్ఉల్లంఘన కిందకు వస్తాయని జ‌య‌రాం కోమ‌టి తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న అశోక్ బాబుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events