విజయ రామరాజు టైటిల్‌రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. అగ్ర దర్శకుడు హను రాఘవపూడి టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ నా 12ఏండ్ల వయసులో ఓ వ్యక్తిని కలిశాను. అతని పేరు అర్జున్ చక్రవర్తి. కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళితే ఆయన ఓ కథ చెప్పారు.

ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో సినిమా రావడానికి సాంకేతిక నిపుణులు చేసిన సాహసం మాటల్లో చెప్పలేను అని అన్నారు. ఏడాదిన్నరపాటు ప్రో కబడ్డీ టీమ్స్‌తో ట్రావెల్ అయ్యి రియల్‌గా కబడ్డీ నేర్చుకున్నానని, జీవితాంతం గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని హీరో విజయరామరాజు అన్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.
















