Namaste NRI

ఆర్యన్ యూనిక్ సీట్ఎడ్జ్ థ్రిల్లర్: హీరో విష్ణు విశాల్

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించిన ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆర్యన్‌. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రేష్ట్‌మూవీస్‌ ద్వారా నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని, యూనిక్‌ సీట్‌ఎడ్జ్‌ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని, తెలుగు వెర్షన్‌లో ైక్లెమాక్స్‌ మార్చి విడుదల చేస్తున్నామని హీరో విష్ణు విశాల్‌ తెలిపారు.

ఈ చిత్రంలో తాను జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తానని కథానాయిక శ్రద్ధాశ్రీనాథ్‌ చెప్పింది. సెల్వరాఘవన్‌, మానస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హరీష్‌కన్నన్‌, సంగీతం: జిబ్రాన్‌, నిర్మాతలు: శుభ్ర, ఆర్యన్‌ రమేష్‌, విష్ణు విశాల్‌, దర్శకత్వం: ప్రవీణ్‌ కె.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events