అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ముజ్‌తబ మొహమ్మద్ ఉత్తర కరోలినా సెనేటర్‌గా విజయం సాధించాడు. ముజ్‌తబ మెక్లెన్‌బర్గ్ కౌంటీ 38వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నార్త్ కరోలినా సెనేటర్‌గా మూడోసారి ఎన్నికయ్యాను. ఈ సందర్భంగా ముత్‌తబ మాట్లాడుతూ మీ అందరి మద్దతులో ఈ ఎన్నికలో గెలిచాను. విద్యలో పెట్టుబడుల కోసం, వైద్యసాయాన్ని సెనేట్‌లోని అన్ని ప్రాంతాలకు వర్తింపచేయడం కోసం కృషి చేస్తాను. అంతేకాదు కరోనా టైంలో దివాళా తీసిన చిన్న వ్యాపార సంస్థలకు అండగా నిలబడతాను అని తెలిపారు. ముజ్‌తబ తల్లిదండ్రులది హైదరాబాద్. మల్లేపల్లి ప్రాంతంలో ఉండే వీళ్లు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. ముజ్‌తబ అమెరికాలోనే పట్టాడు. కరోలినా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మజ్‌తబ ఆ తర్వాత న్యాయశాస్త్రం మీద ఆసక్తితో లా చదివాడు. కుటుంబ కేసుల్ని వాదిస్తుంటాడు.
