Namaste NRI

పల్లెటూరి ప్రేమకథగా.. లోకమెరుగని కథ

సురేంద్ర కుమార్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం లోకమెరుగని కథ. పూజిత కథానాయిక. క్రియేటివ్ డైరెక్టర్స్ క్లబ్ ప్రొడక్షన్స్ పతాకంపై రవికాంత్ జమి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాట్లాడుతూ పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం ఉంది. పాతకాలపు ఆచారాలతో ఉన్న తండ్రి, ఈతరం ఆలోచనలున్న కొడుకు మధ్య జరిగే ఆసక్తికర కధాంశంగా ఉంటుంది అన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు శ్రీకాంత్ కొప్పుల పేర్కొన్నారు. త్వరలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ కొప్పుల, విజయ్ విశ్వనాధన్, పూజిత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ తుమ్మల, మాటలు: ఎస్.ఎన్.ఆర్, తరిణిక, దర్శకత్వం: సురేంద్ర కుమార్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events