గల్లా అశోక్ నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. వారణాసి మానస కథానాయిక. అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఏమయ్యిందే గుండెకూ పాట ప్రోమోను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే ట్యూన్‌తో ఈ పాటను స్వరపరిచారని, హీరోకు హీరోయిన్‌పై ఉండే ఆరాధానను వ్యక్తం చేసేలా ఈ పాట సాగుతుందని, ఈ పాటలో గల్లా అశోక్ అనందంగా కనిపిస్తుంటే, వారణాసి మానస అందంగా కనిపిస్తున్న దనీ, పూర్తి పాటను మే 3న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల.