హైదరాబాద్ నగరంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు ఆదివారం తొలి బొనాన్ని సమర్పించారు. లంగర్ హౌజ్ నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత బోనాల పండుగ ఘనంగా జరుగుతోందని, భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తలసాని పేర్కొన్నారు. కరోనా నియమాలను పాటిస్తూ, బోనాలు జరుపుకోవాలని మంత్రులు సూచించారు.