ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. లంకలో జరగాల్సిన ఆసియా కప్ మరో చోటుకు తరలిపోయింది. లంకలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహించలేమని, ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఆసియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రంగంలోకి దిగి, సభ్య దేశాలతో సంప్రదింపులు జరిపింది. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహణకు మొగ్గుచూపాయి. ఆసియా కప్ టోర్నమెంట్ను యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కూడా ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీమెంట్ జరుగనుంది. ఈసారి ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.














