ఒమిక్రాన్ వేరియంట్‌తో సతమతం అవుతున్న ఆఫ్రికా దేశాలకు తాము అండగా ఉంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్‌తో పోరులో ఆ దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లు, తదితర వుస్తువులన్నింటినీ పంపుతామని చెప్పింది. కరోనా టెస్ట్ కిట్లు, గ్లవ్స్, పీపీఈ కిట్లు, మెడికల్, ఎక్విప్‌మెంట్ ఇలా ఆ దేశాలకు అవసరమైన సామాగ్రి మొత్తం పంపేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు వెల్లడిరచింది. ఆ దేశాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఇప్పటికే బోట్సువానాకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ సరఫరా చేశామని, ఆ దేశాలకు మరింత సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పింది. కాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)