Namaste NRI

తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకలు డిసెంబర్‌ 5 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్‌ 24 వరకూ జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆటా వివిధ ప్రాంతాల్లో ఆట, పాటల పోటీలు, సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులు, మహిళా సాధికారత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వివిధ ప్రాంతాలు ఈ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.  డిసెంబర్‌ 26న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే గ్రాండ్‌ ఫినాలేతో ఈ వేడుకలు ముగుస్తాయని మధు బొమ్మినేని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆటా నిర్వహకులు వివిధ దేశాల్లోని తెలుగు వారిని ఆహ్వానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events